ఆచార్య, పుష్ప, ఆర్ఆర్ఆర్ మధ్య పోటీ.. ఏం జరగబోతోందంటే?

కొరటాల శివ,మెగాస్టార్ హీరోగా కాంబినేషన్ లో ఆచార్య సినిమా రాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ ఆచార్య సినిమాలో చిరంజీవి తో పాటు రామ్చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్యన విడుదల కానుంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరొక పక్క ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ ను మార్చి సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా కంటే ముందుగా ఆచార్య సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆచార్య సినిమాలో ఇంకా రెండు పాటలు చిత్రీకరణ చేయాల్సి ఉంది. తాజాగా అందిన ప్రకారం ఆచార్య సినిమాలో క్రిస్మస్ కి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన ఇంకా రాలేదు. ఇదిలా ఉంటే మరోవైపు సంక్రాంతి ఆచార్య సినిమా వస్తుందని అందుకు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా వాయిదా వేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆచార్య సినిమాను క్రిస్మస్ కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆచార్య సినిమా వస్తే పుష్ప సినిమా పరిస్థితి ఏంటి అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలా ఉంటే ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ను ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ మూడు సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్ లకు సంబంధించిన విషయం ఒక హాట్ టాపిక్ గా మారింది.

Share post:

Popular