అభిషేక్ బచ్చన్.. కూ.. అత్యవసర చికిత్స..?

బాలీవుడ్ లో అమితాబ్ గజం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక అతని కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా మనందరికీ సుపరిచితమే అయితే.అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ లో గాయపడినట్లు తెలుస్తోంది.అభిషేక్ బచ్చన్ ఇలా ఎన్నో సార్లు షూటింగ్ సమయాలలో గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఈయన ముంబై లీలావతి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వెంటనే పరామర్శించడానికి తన తండ్రి అమితాబ్ బచ్చన్ కూడా వచ్చాడు.

కరోనా సమయంలో  బాలీవుడ్ లో ఉన్న హీరోలు చాలామంది షూటింగ్ కి దూరంగానే ఉన్నారట. కానీ అభిషేక్ మాత్రం సినిమాలు షూటింగ్ చేయడానికి ముందుకొచ్చాడు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ తమిళ సూపర్ హిట్ సినిమా.. ఒత్త సెరప్ సైజ్ 7 సినిమాను రీమేక్ లో నటిస్తున్నాడు. తెలుగులో ఈ సినిమాని బండ్ల గణేష్ హీరోగా తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక హిందీలో మటుకు తమిళంలో తెరకెక్కించిన డైరెక్టర్ ఆర్ పార్తిబన్ చేస్తున్నాడు. తమిళంలో ఈయనే హీరోగా నటించాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం ఇదే సినిమాను హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్ గాయపడినట్లు తెలుస్తోంది. ఈయన కుడి చేతికి ఫ్రాక్చర్ అయిన్నట్లు కూడా కనిపిస్తుంది ఈ ఫోటోలో. ఈ చిత్ర షూటింగ్ చేస్తున్న సమయంలోనే గాయపడ్డాడు అభిషేక్. ఈ ప్రమాదంలో ఆయన కుడిచేతికి ఫ్రాక్చర్ అయింది. దాంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి హాస్పిటల్‌లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు అభిషేక్. మరికొన్ని రోజుల్లోనే ఈయన తిరిగి సెట్స్‌లో జాయిన్ కానున్నాడు. ఇదిలా ఉంటే అభిషేక్ ఇలా షూటింగ్‌లో గాయపడటం ఇదే తొలిసారి కాదు.,[object Object]

అందుకోసమే డాక్టర్లను కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోమన్నట్లు సూచించారట. ప్రస్తుతం ఈయన షూటింగును ప్యాకప్ చెప్పేసినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈయన తిరిగి సెట్ లో జాయిన్ కావాలని కోరుకుందాం. ఇంతకుముందు కూడా ఆయన ఎడమ చేతి వేలుకు సర్జరీ జరిగింది. ధూమ్ 3 సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఎడమచేతికి పెద్దగా గాయమే అయ్యిందట.

దీంతో ఈయనకు షూటింగ్ సమయాలలో గాయాలు  మామూలే అంటున్న నెటిజన్లు.. త్వరలో ఆయన గాయాల నుంచి బయటపడాలని కోరుకుందాం.