బిగ్ బ్రేకింగ్ః డ్ర‌గ్స్ కేసులో బాలీవుడ్ న‌టుడు అర్మాన్ కోహ్లీ అరెస్టు

ఇప్పుడు అన్ని సినీ వ‌ర్గాల్లో కూడా బాలివుడ్ డ్రగ్స్ కేసు మరో సారి సంచల‌నం రేపుతోంది. మొన్న‌టి వ‌ర‌కు కాస్త సైలెంట్ గానే ఉన్నా కూడా ఇప్ప‌నుడు మ‌రోసారి తెర‌మీద‌కు వచ్చింది. ఇక ఇటు టాలివుడ్ లో కూడా డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు ఈ కేసులో మ‌రింత వేగంగా విచార‌ణ‌జ‌రుపుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో అటు బాలివుడ్ ప్రముఖ నటుడు అర్మాన్ కోహ్లీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేయడం పెద్ద సంచ‌ల‌నం రేపుతోంది.

ఇక ఇప్పుడు ఆయ‌న్ను ముంబయిలోని త‌న ఇంట్లో ముందస్తు ఇన్ష‌ర్మేష‌న్ ఇచ్చి శనివారం రాత్రి ఎన్సీబీ ఆఫీస‌ర్లు ఆయ‌న ఇంట్లో సోదాలు చేశారు. అనంత‌రం ఇంట్లో డ్రగ్స్ దొరికిన‌ట్టు ఎన్సీబీ ఆఫీస‌ర్లు వివ‌రించారు. కాగా ఆర్మాన్ ను ఎన్ సీబీ మెయిన్ ఆఫీసులో విచారిస్తున్నట్లు స‌మాచారం. ఇక ఇప్పుడు ఆయ‌న ఇంటిపై దాడులు నిర్వహించడం, అలాగే ఆయన్ను అరెస్టుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట విప‌రీతంగా వైరల్ అవుతున్నాయి. కాగా కొన్ని రోజుల‌గా డ్రగ్స్ కేసు బాలీవుడ్ ప్ర‌ముఖుల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Share post:

Latest