ఆ కారణం చేతనే శ్రీదేవి.. శ్రీలతకు దూరం అయిందా..?

అతిలోక సుందరిగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని , తన నటనతో ,అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఉండే నైజం శ్రీదేవిది.. అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో కలిసి నటించి, ఆ తర్వాత నాగార్జున, చిరంజీవి లతో కూడా స్టెప్పులేసింది. ఈమె సినీ ఇండస్ట్రీలో పాత్ర మంచిదైతే నటించడానికి వెనకాడలేదు. ఇక అలా తమిళ సినీ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టి, తన కంటూ ఒక మంచి క్రేజ్ ను సంపాదించుకున్న శ్రీదేవి హిందీలో కూడా పలు చిత్రాలలో నటించింది.

- Advertisement -

ఇక అసలు విషయానికి వస్తే ,శ్రీదేవి.. శ్రీలత తో దాదాపు 17 సంవత్సరాల పాటు మాట్లాడకుండా దూరం అయిందట.. ఇందులో ముఖ్యంగా ఇక శ్రీలత గురించి కేవలం కొద్ది మందికి మాత్రమే తెలుసు. శ్రీలత ఎవరో కాదు.. శ్రీదేవికి కజిన్ సిస్టర్ అవుతుంది. కాకపోతే శ్రీదేవి ఎప్పుడూ శ్రీలత ను తన సొంత చెల్లి లాగే చూసుకునేది. శ్రీదేవి ఏదైనా కొత్త వస్తువు తీసుకొని వచ్చిందంటే చాలు.. శ్రీదేవి తల్లితో.. శ్రీలత గారాబం చేసి మరి కొని తెచ్చుకోవడం లాంటివి చేసేది. అంతేకాదు శ్రీదేవి తో మాట్లాడందే.. శ్రీలతకు నిద్ర కూడా పట్టేది కాదు.అంతలా శ్రీలతకు శ్రీదేవి అంటే ప్రాణం. అంతా ఆప్యాయతగా ఉన్న వీళ్ళిద్దరూ అనుకోకుండా దూరం అవడానికి గల కారణం ఆస్తి అని తెలుస్తోంది.

శ్రీలత సంజయ్ దత్ ను వివాహం చేసుకున్న తర్వాత శ్రీదేవికి, శ్రీలతకు మధ్య ఆస్తి పంపకాలలో గొడవలు వచ్చాయని, ఆ కారణం చేతనే శ్రీదేవి.. శ్రీలత.. ఇద్దరూ దాదాపు 17 సంవత్సరాల పాటు మాట్లాడుకోలేదట. అయితే వీరిద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి బోనికపూర్ వీరిద్దరూ తిరిగి కలిసేలా చేశాడు. ఇక శ్రీదేవిని బోనీ కపూర్ వివాహం చేసుకున్న తర్వాత, చక్కగా చేసుకోవడమే కాదు తన అన్ని బాగోగులను కూడా చక్కగా పెట్టుకుంటూ వచ్చాడు.

Share post:

Popular