427 గ్రామాలను పరిపాలిస్తున్న పెదరాయుడు..

ప్రస్తుతం మన పిల్లలు తొమ్మిది సంవత్సరాల అంటే కేవలం ఆడుకోవడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు. కానీ ఈ బుడ్డోడు కేవలం తొమ్మిది సంవత్సరాల కే సీఎం లెవెల్ లో ఉన్నాడట. ఈ బుడ్డోడు తమిళనాడులోని తిరువన్నమలై జిల్లాలో ఉండే కొండ ప్రాంతానికి ఈ పిల్లోడు పెదరాయుడు.

ఈ బుడ్డోడు కేవలం ఐదో తరగతి చదువుతున్నాడు. కానీ 427 గ్రామాలను ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ బాలుడు ఆజ్ఞ లేకుండా అక్కడ ఏమి జరగలేదట. పోలీసులు, న్యాయవ్యవస్థ అలాంటివి ఏవీ ఉండవట ఆ 427 గ్రామాలలో. ఇంట్లో గొడవలు మొదలు నుంచి భూముల పంచాయతీ వరకు ఈ బుడ్డోడు ఆ ఊర్లో పరిష్కరిస్తూ ఉంటాడట. ఇక అంత మందిని ఎలా మెయింటెన్ చేస్తున్నాడు అంటే.. ఈ బాలుడు కింద కొంత మంది వ్యవస్థాపకులు ఉండడం వల్ల వారిచేత అన్నీ చేయిస్తూ ఉంటారు.ఇక వారందరికీ అండగా ఉంటున్నాడు ఈ బుడ్డోడు.

ఈ బుడ్డోడికి ఆ పదవి ఎలా వచ్చిందంటే, ఆ ఊర్లో వాళ్ళ తాత ఊరిపెద్దగా వ్యవహరించేవాడు. కానీ అతని మరణాంతరం ఈ పదవిని ఈ బాలుడు దక్కించుకున్నాడు. ఈ పిల్లవాడిని 427 గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా శక్తి వేల్ ను సీఎంగా ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఇక పంచాయితీలలో ఎటువంటి తీర్పు, ఎలాంటి సమయాలలో ఇవ్వాలని కూడా ఆ వూరి ప్రజలే ఆ బాలుడి కి కొద్ది రోజులు ట్రైనింగ్ ఇచ్చారట. తమ ప్రజలకు న్యాయం చేస్తానని తాత వారసత్వం,మర్యాద నిలబెడతానని చెబుతున్నాడు ఈ బుడ్డోడు.https://youtu.be/EWOPCMMiR4o