2022 లో ఎన్టీఆర్ ఆ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడా..?

ప్రస్తుతం ఎన్టీఆర్ RRR సినిమా తో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా కొన్ని సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న విషయం కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం వచ్చిన వార్త ఏమిటంటే ఉప్పెన దర్శకుడితో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలను తెలుసుకుందాం.

కేవలం ఒక్క సినిమాతోనే స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు బుచ్చిబాబు. ఆ సినిమా విడుదలై దాదాపు ఇప్పటికి కొన్ని నెలలు కావస్తున్నా, తన నెక్స్ట్ సినిమా ఏంటో ..? ఇంకా ప్రకటించలేదు. ఇదే తరుణంలో తన రెండో సినిమా స్టార్ హీరో అయినటువంటి ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. నాన్నకు ప్రేమతో సినిమా టైమ్ లోనే వీరిద్దరి మధ్య బాగా సన్నిహితం ఏర్పడిందట.

ఆ సన్నిహితం తోనే ఒక సినిమాను తీయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాని ఒక స్పోర్ట్స్ డ్రామా సన్నివేశంలో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ డేట్స్ ఇప్పుడే ఖాళీగా ఉండేటట్లు లేదని సమాచారం కూడా ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఎన్టీఆర్ డేట్స్ మాత్రం 2022 వరకు ఖాళీగా ఉండేటట్లు కనిపించకపోవడంతో, అప్పుడే సినిమాని మొదలు పెట్టాలని చూస్తున్నారు బుచ్చిబాబు.

అంత లోపల వేరొకరితో రెండో సినిమాని పూర్తి చేయాలని చూస్తున్నాడట బుచ్చిబాబు. ఇక ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో కూడా మరొక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని విషయం తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ పూర్తి చేసుకొని బుజ్జి బాబు కు ఏమన్నా సహాయం చేయగలరా..? లేదా..? అనే విషయం పై ఆయనే తెలియజేయాల్సి ఉంటుంది.

ఏది ఏమైనా ఎన్టీఆర్ తో సినిమా అంటే బుచ్చిబాబు మరొక మెట్టు ఎదిగినట్లు అని చెప్పవచ్చు.