చిరు సినిమాకి వీరయ్య టైటిల్ ఫిక్స్ అయినట్లేనా… లేదా..?

మెగాస్టార్ చిరంజీవి, బాబి కాంబోలో వస్తున్న చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ను మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసారు.ఈ లుక్ లో చిరంజీవి అదిరిపోయాడు అనే చెప్పాలి. మాస్ లుక్ లో అభిమానులను ఉర్రుతలూగించడానికి చిరు రెడీ అయినట్లు కనిపిస్తుంది ఈ లుక్.అలాగే ఈ ఫస్ట్ లుక్ తో పాటు మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ అంటూ `పూన‌కాలకు సిద్ధంగా ఉండండి`అని బాబీ కామెంట్ కూడా చేసారు.అయితే ఈ సినిమాకు’వీర‌య్య‌` అనే టైటిల్ కన్ఫార్మ్ అయిపోయిందని వార్తలు కూడా వచ్చాయి.

నిజానికి ఈ సినిమా టైటిల్ ను కూడా మెగాస్టార్ పుట్టినరోజు సందర్బంగా ఆఫీషియల్ గా రివీల్ చేద్దామని అనుకున్నారట. కానీ మన మెగాస్టార్ కి ఈ టైటిల్ నచ్చలేదని తెలుస్తుంది. నిజానికి బాబీ వీరయ్య అనే టైటిల్ ను బేస్ చేసుకుని కధ రాయడం జరిగిందట. అప్పుడు చిరు కూడా సరే అన్నాడట. కానీ వీరయ్య టైటిల్ విషయంలో చిరుకు కొంతమంది సన్నిహితులు ఆ టైటిల్ మరి ఓల్డ్ గా ఉంది అని సలహా ఇవ్వడంతో వీరయ్య టైటిల్ ను హోల్డ్ లో ఉంచడం జరిగింది.వేరే ఏదన్నా డిఫరెంట్ టైటిల్ పెడదామని బాబీతో అన్నట్లు సమాచారం. ఈ టైటిల్ సందిగ్ధం కారణంగా చిరు బర్త్ డే కి అనౌన్స్ చేయలేకపోయారని తెలుస్తుంది.