ఎంపి కె.రఘురామ కృష్ణరాజుకు సుప్రీమ్ కోర్టు శుభవార్త..?

ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం పార్లమెంటు సభ్యుడు, వైసీపీ తరఫున గెలిచి రెబల్ గా మారిని రఘురామ కృష్ణం రాజు గురించి రాజకీయాలు గమనించే వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జగన్ సర్కారు పై ఓ రేంజ్ లో విరుచుకుపడతాడు ఈయన. వైసీపీ ఎంపీలు కొందరు లోక్ సభ స్పీకర్ ను కలిసి రఘురామ పై అనర్హత వేటు వేయాలని కూడా కోరారు. కానీ లోక్ సభ స్పీకర్ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా ఈ అనర్హత పిటిషన్లపై విచారించిన సుప్రీం ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలతో రఘురామ ఫుల్ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది.

పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి అనర్హత పిటిషన్లపై కాలపరిమితిని విధించాలంటూ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశాడు. ఈ పిల్ ను విచారించిన సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రతినిధుల అనర్హత వేటు విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. దీనిపై సర్వాధికారాలు స్పీకర్ కే ఉంటాయని స్పష్టం చేసింది. ఇక నిర్ణీత కాలపరిమితికి సంబంధించి… పార్లమెంటు ప్రత్యేక చట్టం చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.