చిక్కుల్లో పడ్డ యామీ గౌతమ్…?

యామీ గౌతమ్ అంటే యూత్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. అప్పట్లో ఫేర్ అండ్ లవ్లీ యాడ్ లో కనిపిస్తూ అందరి మనసులను యామీ గౌతమ్ ఆకర్షించారు. ఈ మధ్యనే ఆమెకు పెళ్లి జరిగింది. అటు తెలుగు, హిందీ, ఇటు తమిళం సినిమాల్లో చేస్తూ యామీ గౌతమ్ నటనతో ఆకట్టుకున్నారు. ఇకపోతే తాజాగా ఆమెకు ముంబై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ నోటీసులు అందించారు.

పారెన్ ఎక్సెంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద ఆమెకు నోటిసులు జారీ చేశారు. ఆమెపై కొన్ని అభియోగాలున్నాయి. చట్టానికి వ్యతిరేకంగా ఆమె కొన్ని పనులు చేసినట్లు తెలుస్తోంది. అందుకునే ఆమెను వెంటనే హాజరవ్వాలని ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టెర్ నోటీసులు అందజేశారు. యామీ గౌతమ్ ఈ మధ్యే పెళ్లి పీటలు ఎక్కడం, ఈ తరుణంలోనే ఈ ఘటన జరగడంతో పలువురు పెదవి విరుస్తున్నారు. ఈమె తెలుగులో గౌరవం, నువ్విలా, యుద్దం వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె ఈ నోటీసులకు సంబంధించి ఇంకా స్పందించలేదు.

Share post:

Latest