ఆ క్రైమ్ థ్రిల్ల‌ర్ సీక్వెల్‌లో విజ‌య్ సేతుప‌తి..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి.. ఉప్పెన సినిమాతో తన న‌ట‌నా విశ్వ‌రూపం చూపించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈయ‌న మ‌రో తెలుగు సినిమా చేయ‌నున్నాడ‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

బెల్లంకొండ శ్రీనివాస్, డైరెక్ట‌ర్ రమేష్‌ వర్మ కాంబోలో తెర‌కెక్కిన క్రైమ్ థ్రిల్ల‌ర్ రాక్షసుడు చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్‌‌‌మెంట్ కూడా వ‌చ్చింది. అయితే ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీ‌నివాస్ న‌టించ‌డం లేదు. ఆయ‌న స్థానంలో విజ‌య్ సేతుప‌తిని రంగంలోకి దింపుతున్నాడ‌ట ర‌మేష్ వ‌ర్మ‌.

ఇటీవల దర్శకుడు చెన్నై వెళ్లి.. విజయ్ సేతుపతికి క‌థ వినిపించ‌గా, అది ఆయ‌న‌కు బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇదే నిజ‌మైతే ఆయ‌న ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటారు. కాగా, రాక్షసుడు కంటే మరింత థ్రిల్లింగ్‌గా, హర్రర్‌గా రాక్ష‌షుడు 2 ఉండనుంద‌ని.. మ‌రియు త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది.

Share post:

Latest