వెంకటేష్ కూతురుకు అరుదైన గుర్తింపు…?

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాది ట్రెండ్ న‌డుస్తోంది. పంచవ్యాప్తంగా ఇన్ స్టా గ్రామ్‌లో భారీగా ఫాలోవర్స్ కలిగి ఎక్కువ‌గా సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హాపర్ కంపెనీ ప్రకటించింది. ఈ లిస్టులో భారతీయులకు మూడు ప్లేస్‌లు లభించగా అందులో తెలుగు అమ్మాయి, సినీ హీరో వెంకటేష్ కూతురు అయిన ఆశ్రిత దగ్గుబాటికి చోటు లభించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ హాపర్ ఇన్స్‌టాగ్రామ్ రిచ్ జాబితా 2021 ఇలా ఉంది.

- Advertisement -

లక్ష్ల‌లో ఫాలోవర్లు కలిగిన వారికి ఇన్స్‌టాగ్రామ్ వారు పోస్టు చేసే ప్ర‌తి పోస్టుకు కూడా భారీగా రెమ్యున‌రేష‌న్ చెల్లిస్తుంది. అయితే ఇందులో ఇండియా నుంచి ప్రియాంక చోప్రా, విరాట్ కోహ్లీ అగ్ర స్థానాల్లో నిలిచారు. ఇక వారి త‌ర్వాత విక్టరీ వెంకటేష్ కుమార్తె కూడా ఉండటం స‌స్పెన్స్ గా మారింది. ఆమె ఆహార రంగంలో వ్యాపారవేత్తగా ప్ర‌స్తుతం రాణిస్తున్న విష‌యం తెలిసిందే. కాగా ఆశ్రితాకు ఇన్స్‌టాగ్రామ్‌లో 136,359 మంది ఫాలోవర్స్ ఉన్నార‌ని తెలుస్తోంది. ఆమె త‌న ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే ప్రతీ పోస్టుకు కూడా 400 డాలర్లు ఇన్ స్టా గ్రామ్ చెల్లిస్తుంది. దీని విలువ సుమారు 31 వేలు అన్న‌మాట‌.

Share post:

Popular