వామ్మో, 150 సిగరెట్స్ తాగిన అసురన్ ఫేమ్ వెట్రిమారన్..!

సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యసనాల గురించి బయటపెట్టరు. కానీ అసురన్ డైరెక్టర్ వెట్రిమారన్ మాత్రం తన చెడు వ్యసనం గురించి బయట పెట్టి అందరికీ షాక్ ఇస్తున్నారు. 13 సంవత్సరాల వయసు నుంచే తాను సిగరెట్ తాగడం ప్రారంభించాలని వెట్రిమారన్ చెప్పుకొచ్చారు. “నా మొదటి సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో నేను 150 నుంచి 160 సిగరెట్లు తాగాను. కానీ ఒకరోజు సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా చూశాను. ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. ఆ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక సిగరెట్ తాగాను. నా జీవితంలో అదే ఆఖరి సిగరెట్.” అని వెట్రిమారన్ వెల్లడించారు.

గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ 2008లో విడుదలైంది. అంటే వెట్రిమారన్ గత 13 సంవత్సరాలుగా సిగరెట్ జోలికి వెళ్ళ లేదని తెలుస్తోంది. వెట్రిమారన్ పొల్లధవన్, ఆడుకాలం, విసరనై, వడ చెన్నై, అసురన్ వంటి చిత్రాలను అద్భుతంగా రూపొందించారు. ఆయన తన సినిమాల ద్వారా తమిళనాడులో జరిగిన నిజ సంఘటనలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. భారతదేశంలోని ఉత్తమ దర్శకుల్లో ఆయన మొదటి వరుసలో ఉంటారని నిస్సందేహంగా చెప్పవచ్చు.

Share post:

Latest