రామ్ సినిమాకి `ఉస్తాద్` టైటిల్ ఖరారు..?

ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఊర మాస్ హీరోగా మారిపోయిన రామ్ పోతినేని యాక్షన్ సినిమాలు తప్పించి మరేతర సినిమాలు చేయడం లేదు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు లింగుస్వామితో కలిసి మరో మాస్ యాక్షన్ ఫిలిం చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి అధికారికంగా క్లాప్ కొట్టిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెరమీదికి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాకి `ఉస్తాద్` అనే టైటిల్ ఖరారు చేయాలని చిత్రబృందం భావిస్తోందట. విశ్వసనీయ సమాచారం ప్రకారం దాదాపుగా `ఉస్తాద్` అనే శీర్షికనే ఖ‌రారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

రామ్ పోతినేని `ఇస్మార్ట్ శంక‌ర్‌` సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సంగతి విధితమే. ఈ చిత్రంలో రామ్ తనని తాను `ఉస్తాద్ ఇస్మార్ట్ శంక‌ర్‌…` అని చెప్పుకుంటారు. అయితే ఈ డైలాగ్ లోని ‘ఉస్తాద్’ నే ఇప్పుడు తన అప్‌కమింగ్ సినిమాకి టైటిల్ గా మార్చాలని రామ్ అనుకుంటున్నారు. ఆయన ఇదే టైటిల్ ని చిత్ర బృందానికి కూడా సూచించారట. కాగా ఈ సినిమా టైటిల్ అధికారికంగా త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇకపోతే కృతి శెట్టి క‌థానాయిక‌గా నటించే ఈ సినిమాలో రామ్ ఓ పోలీస్ గా క‌నిపించ‌నున్నారు.

Share post:

Latest