నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!

ఏపీ ప్రభుత్వం రాష్ర్టంలోని నిరుద్యోగుల కోసం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై రచ్చ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. దీని ప్రకారం జూలైలో మొత్తం 1238 ఎస్సీ, ఎస్టీ డిఏ బ్యాక్ లాగ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తామని ప్రకటించింది. కాగా… ఇప్పటికే అనుమతించిన 802 పోస్టుల్లో 432 ఎస్సీ 370 ఎస్టీ లకు చెందిన పోస్టులుండగా… తాజాగా కూడా మరో 600 పై చిలుకు పోస్టులున్నాయి.

కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ జాబ్ క్యాలెండర్ పై విమర్శలను బాణాలు వదులుతూనే ఉన్నాయి. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకారంగా… నెల నెలా ఉద్యోగ ప్రకటనలు ఉంటాయని తెలిపింది. మరో వైపు అసలు ఇది జాబ్ క్యాలెండరా… జాబ్ లెస్ క్యాలెండరా అని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కొంత మంది ప్రజలు, రాజకీయ నాయకులు ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను మెచ్చుకుంటున్నాయి. ప్రభుత్వం నిరుద్యోగుల కష్టాలను గుర్తుంచుకుని… మంచి పని చేసిందని అభివర్ణిస్తున్నాయి.