టీడీపీకి షాక్… మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!

ఏపీలో గతంలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి అనేక ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తెలంగాణ లో రాష్ర్ట అధ్యక్షుడి హోదాలో ఉన్న రమణ టీఆర్ఎస్ గూటికి చేరి గులాబీ కండువాను కప్పుకున్న విషయం మరువక ముందే ఏపీలో మరో మాజీ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి కూడా టీడీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సమర్పిస్తానని ఆమె చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే హైమావతి కూతురు స్వాతి అధికార వైసీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా తల్లి కూడా టీడీపీకి దూరం కావడం తెలుగు తమ్ముళ్లు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. తన కూతురు వైసీపీలో చేరినంత మాత్రాన తనను దూరం పెట్టడం భావ్యం కాదంటూ హైమావతి ఆ మధ్య వ్యాఖ్యలు చేయడం గమనార్హం. టీడీపీకి రాజీనామా ప్రకటించిన హైమావతి వైసీపీ కండువా కప్పుకుంటారా? లేక రాజకీయాలకే దూరంగా ఉంటారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

Share post:

Latest