టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్..!

శ్రీవారి భక్తులకు అతిత్వరలోనే టీటీడీ ఒక శుభవార్తను తెలియ చేయబోతుంది.. చాలా కాలంగా ఎదురు చూస్తున్న తిరుమల శ్రీవారి సర్వదర్శన భాగ్యం అతి త్వరలోనే తిరిగి మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆగస్టు నెలలో శ్రీవారి దర్శనం మొదలవ్వాలని టీటీడీ భావిస్తున్నట్లు సమాచారం.. కరోనా పాజిటివ్ ఒకటి శాతానికి వస్తే భక్తులకు ఉచిత దర్శన భాగ్యం కల్పించాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం.. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన సమయంలో మరో 20 రోజుల్లో కేసులు మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతానికి మాత్రం 300 రూపాయల ప్రత్యేక దర్శనం మాత్రమే భక్తులకు అవకాశం కల్పించింది టీటీడీ. అలాగే జూన్ 7, 2020 నుంచి రోజుకు 5000 మంది ప్రత్యేక దర్శనానికి ఆన్లైన్ ద్వారా టికెట్లు జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. భక్తులకు ఆరోగ్య భద్రతకు ఎలాంటి ఇబ్బందులు లేని పరిస్థితి ఏర్పడితే ఆగస్టు నెల నుంచి స్వామి వారి సేవలను పరిమిత సంఖ్యలో శ్రీవారి భక్తులకు అనుమతించేందుకు టీవీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సేవలతో పాటు సామాన్య ప్రజలకు ఉచిత దర్శనం భాగ్యం కల్పించే అందుకు సిద్ధంగా ఉంది టీటీడీ.

Share post:

Latest