తెలంగాణ వెబ్‌సైట్లు 2 రోజులు బంద్..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆన్‌లైన్‌ సేవలు, వెబ్‌సైట్స్ అన్ని కూడా రెండు రోజులపాటు నిలిచిపోనున్నాయి. గవర్నమెంట్ టు సిటిజెన్, గవర్నమెంట్ టు గవర్నమెంట్ సేవలు జులై 9 రాత్రి 9 గంటల సమయం నుంచి జులై 11 రాత్రి 9 గంటల సమయం వరకు నిలిచిపోనున్నాయని తెలంగాణ స్టేట్ డేటా సెంటర్ వెల్లడించింది. అయితే వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ సేవలను పర్యవేక్షిస్తూ.. అవసరమైన సౌకర్యాలు అందించే స్టేట్‌ డేటా సెంటర్‌ లో అడ్వాన్స్డ్ యూపీఎస్‌(అన్‌ ఇంటరప్టబుల్‌ పవర్‌ సోర్స్‌) సిస్టంను ఏర్పాటు చేయడానికి రోజులు సమయం తీసుకున్నారు. దీనివల్ల 48 గంటల పాటు తెలంగాణ ప్రభుత్వ ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోనున్నాయి.

వాస్తవానికి, విద్యుత్ అంతరాయం కలిగితే యూపీఎస్‌ సిస్టంపై వెబ్‌సైట్లు పని చేయాల్సిన ఉంటుంది. అయితే గతంలో ఆన్‌లైన్‌ వినియోగం చాలా తక్కువగా ఉండేది కాబట్టి సాధారణ యూపీఎస్‌ లతో సేవలు అందించేవారు. కానీ ప్రస్తుతం ఆన్‌లైన్‌ సేవలు వినియోగించుకునే ప్రజల సంఖ్య పెరిగిపోయింది. దీనివల్ల సమర్థవంతమైన అధునాతన యూపీఎస్‌ సిస్టం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.