అదిరే ప్లాన్ లో ఉన్న రాజమౌళి… ఎందుకంటే..?

బాహుబలితో తెలుగు ఇండస్ట్రీకి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన దర్శక దిగ్గజం రాజమౌళి. ఆయన తీసిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదు అంటే ఆయన ఎంతటి పని గొప్ప దర్శకుడో చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో ఒక మాయాజాలం సృష్టించిన జక్కన్న..ఆ తరువాత మరో రియల్ పవర్ ఫుల్ హీరోలతో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ మొదలెట్టాడు. తారక్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు మాస్ హీరోస్ తో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

“రౌద్రం రణం రుధిరం” అనే పేరుతో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఫైనల్ టచ్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న జక్కన్న టీం ప్రమోషన్స్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రమోషన్స్ కి కూడా ఈ దర్శక ధీరుడు ఏకంగా ఒక సెపరేట్ టీమ్ ని పెట్టేసుకున్నాడు. అయితే రాజమౌళి మరో అదిరే ప్లాన్ ని కూడా వేసినట్టు తెలుస్తోంది. ఈసారి ఒక ప్రమోషనల్ వీడియో సాంగ్ ని ఈ చిత్రం కోసం డిజైన్ చేస్తున్నారట. అందుకోసం భారీ సెట్టింగ్స్ కూడా వేస్తున్నట్టు సమాచారం. ఎప్పుడు ఊహకు అందని కథలతో, కళ్ళు చెదిరే సెట్ తో మన ముందుకు వచ్చే ఆ దర్శకుడి నయా ప్లాన్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Share post:

Latest