క‌త్తి మ‌హేష్ మ‌ర‌ణం..మీ హీరో కూడా పోతాడంటూ రెచ్చిపోయిన శ్రీ‌రెడ్డి!

ప్ర‌ముఖ న‌టుడు, ఫిలిం క్రిటిక్‌, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ క‌త్తి మ‌హేష్ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. రెండు వారాల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన క‌త్తి మ‌హేష్‌.. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈయ‌న మరణం సినీ లోకంలో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ నేప‌థ్యంలోనే చాలామంది ప్రముఖులు సంతాపం తెలపగా.. కొంతమంది నెటిజన్లు మాత్రం క‌త్తి మ‌హేష్‌ మృతిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొంద‌రు..తమ హీరోను అన్ని మాటలు అనడం వల్లనే ఇలా జరిగిందని కామెంట్లు పెడుతున్నారు. ఇవి గ‌మ‌నించిన శ్రీ‌రెడ్డి సోష‌ల్ మీడియా వేదిక‌గా రెచ్చిపోయింది.

`అందరు వెనక, ముందు పోవాల్సిందే..కత్తి మహేష్ మరణాన్ని కూడా పండగ లా చెప్పుకునేవాళ్ళకి అపహాస్యం చేసేవాళ్ళకి ఇదే నా ఆన్సర్,రేపో ఎల్లుండో మీరు కూడా పోవాలి, మీ హీరో కూడా పోతాడు.. మీరేదో యుగపురుషులు లాగా ఎందుకురా పోజులు ?? బుర్ర అప్పుడప్పుడు వాడండి.. కత్తి మహేష్ ఆత్మకు శాంతి చేకూరాలి` అంటూ ఫేస్‌బుక్ ద్వారా పోస్ట్ పెట్టింది. ఇక ఈ పోస్ట్‌తో.. శ్రీ‌రెడ్డిపై విరుచుకుప‌డుతున్నారు ప‌వ‌న్ ఫ్యాన్స్‌.

Share post:

Popular