రోటీవాలాగా మారిన సోనూ.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

నటుడు సోనూ సూద్ పేరు తెలియని వారు ప్రస్తుతం మన దేశంలో ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. నటుడిగా విలక్షణ పాత్రలు చేసే సోనూ కొంత మందికే పరిచయమున్నా… మన దేశంలో కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సోనూ చేస్తున్న సేవా కార్యక్రమాలతో అతడి పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది.

అంతలా జనాల బాధలను తీరుస్తున్నాడు సోనూ. తనకు తెలిసిన వారైనా తెలియని వారైనా సరే సాయం కోరి అభ్యర్థిస్తే ఇట్టే సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నాడు. తాజాగా సోనూ సూద్ తన ట్విటర్ లో రోటీలు చేస్తూ వీడియోను పోస్టు చేశాడు. ఇది చూసిన చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అసలు సోనూ సూద్ ఏంటి రోటీలు చేయడం ఏంటి అని ముక్కున వేలేసుకున్నారు. కానీ చిరు వ్యాపారుల వ్యాపారాలకు సోనూ ఇలా ఫ్రీగా పబ్లిసిటీ ఇస్తున్నాడని తెలిసి అతడు చేసిన మంచి పనికి మెచ్చుకోలేకుండా ఉండలేక పోతున్నారు.

Share post:

Latest