స్నేహ చేసిన ఆ పనికి పగలబడి ఫ్యాన్స్ ఏమి అంటూన్నారు అంటే ..?

చిన్న పిల్లలకు ఇంజక్షన్ అంటే చాలా భయం. జ్వరం వచ్చింది అని ఆసుపత్రికి తీసుకెళ్తే వారు సూది మందును చూడగానే బావురుమంటారు. బిగ్గరగా ఏడుస్తూ హాస్పిటల్ మొత్తం దద్దరిల్లేలా ఏడుపు మొదలెడతారు. చిన్నపిల్లలే కాదు కొందరి పెద్దవాళ్లకు కూడా సూది మందు అంటే ఇంకా భయమే. మన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా సూది మందు తీసుకోవడం ఇష్టం ఉండదట. దాని నుండి తప్పించుకోవడం కోసం ఆయన తెగ ప్రయత్నిస్తారట.

అయితే ఈ లిస్ట్ లో అందాల భామ స్నేహ కూడా వచ్చి చేరింది. మాయదారి కరోనా వల్ల ఇప్పుడు ప్రతీ ఒక్కరూ టీకా తీసుకోవాల్సి వస్తుంది. అయితే టీకా వేసుకోడానికి ఆసుపత్రికి వెళ్లిన సీనియర్ హీరోయిన్ స్నేహ ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు తెగ హంగామా చేసింది. సూది దగ్గరికి తీసుకురాగానే వెనక్కు వెళ్తూ.. మళ్ళీ దైర్యం తెచ్చుకొని ముందుకు వస్తే ఇదే సీన్ రిపీట్ చేసింది. చిన్న ఇంజక్షన్ కు స్నేహ భయపడిన తీరును స్వయంగా ఆమె భర్త వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇంకేముంది స్నేహకు ఇంజెక్షన్ అంటే ఇంతా భయమా అంటూ కొందరు నవ్వేసుకుంటున్నారు.

Share post:

Latest