సత్యదేవ్ మూవీకి ప్రెజెంటర్ గా మారిన కొరటాల శివ..?

కథ, సంభాషణల రచయితగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొరటాల శివ నిర్మాణ రంగంలోకి కూడా ప్రవేశిస్తున్నారు. యంగ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాకి సమర్పకుడిగా కొరటాల శివ వ్యవహరిస్తున్నారు. ఐతే ఈరోజు సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా పోస్టర్ విడుదల చేయగా.. ఈ పోస్టర్ లో కొరటాల శివ ప్రజెంట్స్ అని రాసి ఉండడం చూడొచ్చు. ఈ బర్త్ డే పోస్టర్ లో సత్యదేవ్ అర్జున్ రెడ్డి మాదిరి గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ తో కనిపించారు.

ఈ చిత్రానికి వివి గోపాల కృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తుండగా.. కృష్ణ కొమ్మలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి కృష్ణ కొమ్మలపాటి, కొరటాల శివ మంచి స్నేహితులు. ఇటీవల కృష్ణ తన దగ్గర ఉన్న స్క్రిప్ట్ ని డైరెక్ట్ చేయాల్సిందిగా కొరటాల శివని అడిగారట. ఐతే స్క్రిప్ట్ విన్న తర్వాత కొరటాల శివ కూడా ఇంప్రెస్ అయ్యారట. కానీ దర్శకత్వ బాధ్యతను మాత్రం చేపట్టలేదు. బదులుగా ఆయన ఈ సినిమాకి ప్రెజెంటర్ గా మారారు.