ఆ రోజు నుంచే శబరిమల దర్శనం ప్రారంభం..!

చాలా రోజులుగా ఎదురు చూస్తున్నా శబరిమల భక్తులకు తాజాగా ఆలయ అధికారులు శుభవార్త తెలియజేశారు. నెలవారి ఆరాధన కోసం శబరిమల ఆలయాన్ని జులై 17 నుంచి 21 వరకు తెరిచి ఉంచుతాము అని అధికారులు తెలియజేశారు. ఈ క్రమంలో కరోనా వైరస్ ఉధృతి మధ్య శబరిమల ఆలయం తిరిగి ప్రారంభం అవ్వబోతునందుకు వైరస్ వ్యాప్తి చెందకుండా భక్తులు కోవిడ్ భద్రత ప్రోటోకాల్ను కచ్చితంగా పాటించాలని అధికారులు తెలియజేస్తున్నారు.

ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రవేశం కోసం కొన్ని నియమాలను ఏర్పాటు చేశారు. అది ఏమిటంటే కరోనా టీకాలు వేయించుకున్న భక్తులకు మాత్రమే ఆలయంలోకి ఎంట్రీకి అనుమతి ఇవ్వబోతున్నట్లు, అలాగే కోవిడ్ టీకా సర్టిఫికెట్ ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆలయ లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు 48గంటల కరోనా నెగటివ్ రిపోర్ట్ను చూపించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా కేవలం ఐదు వేల మంది భక్తులకు మాత్రమే ఆలయంలోకి ప్రవేశించబోతున్నట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. కేరళ రాష్ట్రంలో ప్రతి రోజు కూడా 15 వేల కేసులు నమోదు అవుతున్నాయి.

Share post:

Latest