అనిరుథ్ కేవలం అందుకోసమేనట.. ఆర్ఆర్ఆర్ టీం క్లారిటీ

టాలీవుడ్ దర్శకధీరుడు జక్కన్న తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ పై అనేక అంచనాలున్నాయి. ఈ అంచనాలను అందుకోవడం కోసం సినిమా యూనిట్ విపరీతంగా కష్టపడుతోంది. ఈ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఓ కొలిక్కి రావడంతో టీం ప్రమోషన్ సాంగ్ పై దృష్టి కేంద్రీకరించింది. ఈ ప్రమోషన్ సాంగ్ కోసం తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుథ్ ను తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.

కానీ అనిరుథ్ కేవలం తమిళ్ కు మాత్రమే ప్రమోషనల్ సాంగ్ కంపోజ్ చేస్తాడని తాజాగా చిత్ర యూనిట్ పేర్కొంది. అంటే తెలుగు ప్రమోషనల్ సాంగ్ ను కీరవాణే కంపోజ్ చేయనున్నట్లు చెప్పకనే చెప్పారు. ప్రమోషనల్ సాంగ్స్ ను అందంగా తీర్చిదిద్దడంలో అనిరుథ్ ది అందె వేసిన చేయి. కాబట్టి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషనల్ సాంగ్ కు కూడా అనిరుథ్ ను ఎంపిక చేసి ఉంటారని అందరూ ఊహించారు కానీ జక్కన్న టీం అనుకోని సర్ ప్రైజ్ ఇచ్చి అనిరుథ్ ను కేవలం తమిళ వర్షన్ కు మాత్రమే ఫిక్స్ చేసింది.

Share post:

Popular