అవును, యంగ్ హీరో నాగ శౌర్యకు రానా దగ్గుబాటి వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. నాగ శౌర్య హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఇందులో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
అయితే షూటింగు సమయంలోబ్రహ్మాజీతో తిగిన ఒక ఫొటోను నాగశౌర్య ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ..`నా తమ్ముడు బ్రహ్మాజీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాడు .. మీ అందరి సపోర్టు కావాలి .. దయచేసి యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించండి` అంటూ సరదాగా రాసుకొచ్చాడు. అయితే ఈ పోస్ట్‌పై రానా స్పందించాడు.
`వామ్మో ఇదేంటి గురు! నాగశౌర్య.. దయచేసి నువ్వు జాగ్రత్తగా ఉండు. బ్రహ్మాజీ చూపు నాకేంటో తేడాగా కనిపిస్తోంది.` అని అంటూ స్వీట్‌గా హెచ్చరించాడు. అందుకు శౌర్య కూడా ప్రతిస్పందించారు. `నువ్వు చెప్పింది కరెక్ట్ భయ్యా. నాకూ ఏదో తేడాగా అనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండాల్సిందే` అని కామెంట్ పెట్టాడు. మొత్తానికి బ్రహ్మాజీపై వీరి కామెడీ సంభషణ మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Na thammudu @actorbrahmaji kothaga industry ki vachadu. Mi andari support thanaki undali. Please support young talent 💪😜#NS22#IRA4 pic.twitter.com/OIgx5UFkSK
— Naga Shaurya (@IamNagashaurya) July 23, 2021