రామ్‌ చరణ్‌ డ్రైవర్‌ జీతం ఎంతో తెలిస్తే మ‌తిపోవాల్సిందే?!

టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్టార్ హీరోగానే కాకుండా నిర్మాత‌గా కూడా దూసుకుపోతున్న రామ్ చ‌ర‌ణ్‌.. క‌రోనా స‌మ‌యంతో త‌న‌వంతుగా ఎంద‌రికో సాయం చేశాడు. అలాగే త‌న ద‌గ్గ‌ర ప‌ని చేసే స్టాఫ్ ను కూడా క‌రోనా స‌మ‌యంలో ఎటువంటి ఇబ్బందులు ప‌డ‌కుండా చూసుకున్నాడు.

- Advertisement -

పండుగలకు, పబ్బాలకు బోనస్‌లు, ఇతర సౌకర్యాలు కల్పించ‌డ‌మే కాదు.. మంచి జీతాలు చెల్లిస్తాడు. ఈ క్ర‌మంలోనే రామ్ చ‌ర‌ణ్ డైవ‌ర్ జీతం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్ర‌కారం.. త‌న డ్రైవ‌ర్‌కు చెర్రీ ఏకంగా రూ. 45 వేల పైనే జీతం ఇస్తున్నాడ‌ట‌.

నిజానికి బయటకు వెళ్లినప్పుడు ఎక్కువ శాతం చెర్రీనే డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్తాడు. డ్రైవర్‌ను చాలా త‌క్కువ‌గా తనతో పాటు తీసుకువెళ్తాడు. అయిన‌ప్ప‌టికీ త‌న కారు డ్రైవ‌ర్‌కు ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఇచ్చే జీతం చెల్లిస్తున్నాడంటే చెర్రీది ఎంత గొప్ప మ‌న‌సో అర్థం చేసుకోవ‌చ్చు.

Share post:

Popular