కొత్త ప్రపంచానికి స్వాగతం పలుకుతున్న రాశీఖన్నా..?

ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా సినిమాలకు చాలా వేగంగా ఒకే చెపుతుంది. ప్రస్తుతం ఈమె తెలుగులో ‘పక్కా కమర్షియల్‌’ ‘థాంక్యూ’ సినిమా లతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతే కాకుండా తమిళంలో సుందర్‌ సి దర్శకత్వం వహిస్తున్న ‘ఆరణ్మనై-3’ చిత్రంలో నటిస్తునట్లు సమాచారం. ఈ సినిమాలో ఆర్య కథానాయకుడిగా నటిస్తున్నాడు.

- Advertisement -

తాజాగా ఈ సినిమాకు సంబందించిన షూటింగ్‌ చెన్నైలో మొదలు అయ్యేంది. ప్రస్తుతం ఈ సినిమా లోని నాయకానాయికలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో రాశీఖన్నా గ్లామర్‌ పాత్రలో కనిపించ బోతునట్లు సమాచారం. ఈ సందర్భంగా రాశీఖన్నా సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటోను షేర్‌ చేసింది. ఇక ఆ పోస్ట్ కు సరికొత్త ‘ఆరణ్మనై-3’ ప్రపంచానికి స్వాగతం’ అంటూ క్యాప్షన్‌ను పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే రాశీఖన్నా హిందీలో రాజ్‌-డీకే దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్‌లో కూడా నటిస్తున్నట్లు సమాచారం.

Share post:

Popular