గోల్డ్_మెడల్ సొంతం చేసుకున్న భారతీయ వజ్రం..!

జపాన్ రాజధాని టోక్యో వేదికగా ప్రారంభమైన విశ్వక్రీడా సంబురంలో భారత్ సత్తా చాటుతోంది. మీరాభాయి చాను వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం సాధించి బోనీ చేయగా, తాజాగా భారత రెజ్లర్ ప్రియా మాలిక్ సంచలనం సృష్టించింది. రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ ఒలింపిక్స్‌లో వివిధ క్రీడాంశాల్లో పాల్గొనేందుకు గాను భారత ఆటగాళ్లు అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలోనే హంగేరీలో నిర్వహించబడుతున్న రెజ్లింగ్ పోటీల్లో 73 కేజీల విభాగంలో ఫైనల్‌లో విజయం సాధించి పసిడి కైవసం చేసుకుంది ప్రియా మాలిక్.

ఒలింపిక్స్‌లో భారత్ తరఫున తొలి విజయం మహిళదే కాగా, రెండో విజయం కూడా మహిళదే కావడం విశేషం. మొత్తంగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ సారి దేశానికి బోలెడన్నీ పతకాలు తీసుకొస్తారని నూట ముప్పైదు కోట్ల భారతీయులూ ఆకాంక్షిస్తున్నారు. ఇక రెజ్లింగ్‌లో 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా, 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా, 57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా పురుషుల జాబితాలో పోటీపడనున్నారు. మహిళల విభాగంలో సీమా, వినేశ్ ఫోగర్, అన్షు, సోనమ్ బరిలో ఉన్నారు. వీరు తప్పక సత్తా చాటుతారనే అంచనాలు ఉన్నాయి.