`డెవిల్‌`గా రాబోతున్న క‌ళ్యాణ్ రామ్‌..అదిరిన ఫ‌స్ట్ లుక్‌!

నంద‌మూరి న‌ట వార‌సుడు క‌ళ్యాణ్ రామ్ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా త‌న 21వ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించాడు. న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి డెవిల్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ద బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్‌లైన్‌.

Image

ఈ చిత్రాన్ని దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ మ‌రియు ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఆక‌ట్టుకుంటున్న ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో క‌ళ్యాణ్ రామ్ లుక్ ఎంతో వైవిధ్యంగా ఉంది.

Image

1940 నేప‌థ్యంలో సాగే చిత్రమ‌ని ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. మ‌రియు కెరీర్ లో కళ్యాణ్ రామ్ మునుపెన్నడూ ప్రయత్నించని డిఫ‌రెంట్‌ థీమ్ తో ఈ చిత్రం తెర‌కెక్క‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అదిరిపోవ‌డ‌మే కాదు.. సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. కాగా, రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో క‌ళ్యాణ్ 19వ‌ చిత్రం తెర‌కెక్క‌తుండ‌గా.. 20వ చిత్రం దిల్ రాజు నిర్మాణంలో గుహన్ దర్శకత్వంలో తెర‌కెక్క‌నుంది.

Share post:

Popular