బాలీవుడ్ స్టార్ హీరోతో న‌భా న‌టేష్ రొమాన్స్‌..త్వ‌ర‌లోనే..?

న‌భా న‌టేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. ప్రస్తుతం క్రేజీ ఆఫ‌ర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. నితిన్ హీరోగా తెర‌కెక్కిన మాస్ట్రో చిత్రంలో న‌భానే హీరోయిన్‌గా న‌టించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

అయితే ఇప్పుడు ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరోతో రొమాన్స్ చేసే అవ‌కాశాన్ని అందుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు..హృతిక్ రోషన్. లేటెస్ట్ స‌మాచారం ప్రకారం.. జాన్ లె కారే అనే పుస్తకం ఆధారంగా రూపొందిన హిట్ బ్రిటిష్ గూఢచారి థ్రిల్లర్ ‘ది నైట్ మేనేజర్’ అనే సిరీస్‌‌‌‌‌కు బాలీవుడ్‌లో రీమేక్ తెర‌కెక్కిస్తున్నారు.

ఈ సిరీస్‌లో హృతిక్ రోషన్ హీరోగా న‌టిస్తుండ‌గా.. ఆయ‌న‌కు జోడీగా న‌భాను ఎంపిక చేశార‌ట‌. అంతేకాదు, త్వ‌ర‌లోనే ఈ సిరీస్ షూటింగ్ స్టార్ట్ కానుంద‌ని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్ర‌ట‌క‌న రావాల్సి ఉంది.

Share post:

Latest