‘ముగ్గురు మొనగాళ్లు’ రిలీజ్ తేదీ ఖరారు..!

కమెడియన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు శ్రీనివాస్‌రెడ్డి. పూరీజగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇడియట్’ సినిమా నుంచి మొదలుకుని నేటి వరకు సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోస్‌కు ఫ్రెండ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కాగా, శ్రీనివాస్‌రెడ్డి ‘గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. ‘గీతాంజలి’ వంటి హర్రర్ సినిమాతో పాటు ‘జయమ్ము నిశ్చయమ్మురా’వంటి ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించారు.

ఈ రెండు సినిమాల్లో ఒకదాంట్లో స్పెషల్ రోల్‌ను హీరోయిన్ అంజలి ప్లే చేయగా, మరో సినిమాలో ఆయనకు జోడీగా పూర్ణ నటించారు. తాజాగా ఆయన హీరోగా మరో సినిమాలో నటించారు. అదే ‘ముగ్గురు మొనగాళ్లు’. ఈ సినిమా అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తుంది. స్టూడియోస్‌ పతాకంపై అచ్యుత్‌ రామారావు ఈ ఫిల్మ్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీనివాస్‌ రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తుండగా, దీక్షిత్‌ శెట్టి, వెన్నెల రామారావు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వచ్చే నెల 6వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మేరకు మూవీ యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసింది.

Share post:

Latest