‘అన్నీ మంచి శకునములే’ పోస్టర్ విడుదల ..!

టాలీవుడ్ లో కుర్ర హీరోల హవా నడుస్తోంది. మొన్నటికి మొన్న పేపర్ బాయ్ సినిమాతో సంతోష్ శోభన్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత తాజాగా ఆ హీరో ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఆ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ తరుణంలోనే ఈ యంగ్ హీరో వరుస సినిమాలు తీస్తూ బిజీ అవుతున్నాడు. తాజాగా ఈ హీరో అన్నీ మంచి శకునములే అనే టైటిల్ తో సరికొత్త సినిమా గురించి ప్రకటన వెలువడించారు.

నందినీ రెడ్డి డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. జాతిరత్నాలు సినిమాను నిర్మించిన స్వప్న సినిమాస్ బ్యానర్ పైనే ఈ మూవీ కూడా నిర్మితమవుతోంది. “అన్నీ మంచి శకునములే” టైటిల్ ను ప్రకటిస్తూ సినిమా యూనిట్ తన సినిమాలోని మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇదొక ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్ గా చేస్తోంది. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Share post:

Popular