న‌వ్వులు పూయిస్తున్న‌ `మంచి రోజులు వచ్చాయి` ఇంట్రో!

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభ‌న్, మెహ్రీన్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `మంచి రోజులు వచ్చాయి`. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని వి సెల్యూలాయిడ్‌ సంస్థతో కలిసి ఎస్‌.కె.ఎన్‌ నిర్మించారు. నిజజీవిత పాత్ర స్ఫూర్తితో రూపొందించిన చిత్రమిది.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల సిద్ధంగా ఉంది. ఈ క్ర‌మంలోనే చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా మంచి రోజులు వ‌చ్చాయి ఇంట్రో వీడియోను విడుద‌ల చేశారు. ఇందులో అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. అలాగే అన్ని వర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న ఈ ఇంట్రో వీడియోలో కొన్ని కొన్ని స‌న్నీవేశాలు న‌వ్వులు పూయిస్తున్నాయి.

`మీరు భ‌యానికి భ‌య‌ప‌డి ఎంత దూరం పారిపోతే.. అది మీకు అంత ద‌గ్గ‌ర అవుతుంది. ఆయ‌న మీకు అంత‌ దూరం అవుతారు` అంటూ సంతోష్ చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. ఇక మొత్తానికి ఇంట్రోతోనే సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రీయేట్ చేసేశారు. కాగా, త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించ‌నుంది.

Share post:

Latest