మహేష్- త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ న్యూస్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు డైరెక్ట‌ర్ పరశురామ్ పెట్లతో క‌ల‌సి సర్కారు వారి పాట మూవీని చేస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక ఈ మూవీ రెండో షెడ్యూల్ కి కూడా ఇప్పుడు అన్ని రెడీ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. కాగా ఈ మూవీపై ఎన్ని అంచనాలు ఉన్నాయో దాన్ని మించి మ‌రీ ఆయ‌న తర్వాత ప్లాన్ చేసిన త్రివిక్రమ్ తో చేయ‌బోయే ప్రాజెక్ట్ పై ఉన్నాయి.

ఇక మహేష్, త్రివిక్రమ్ నుంచి వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది కావడంతో దానిపై కూడా భారీగానే అంచనాలు నెల‌కొన్నాయి. కాగా ఈ మూవీ కూడా త్వరలోనే షూట్ స్టార్ట్ అవుతుంద‌ని తెలుస్తోంది. ఈ టైమ్‌లో ఈ మూవీపై ఒక ఊహించని అప్డేట్ నే బయటకి వచ్చింది. ఈ మూవీవ‌లో మొత్తం 5 పాటలు ప్లాన్ చెయ్యగా వాటిలో ఇప్ప‌టికే మూడు పాటలు కంప్లీట్ అయిపోయాయని తెలుస్తోంది. కాగా రీ రికార్డింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ పెట్టనున్నట్టుగా సంగీత దర్శకుడు థమన్ క్లబ్ హౌస్ లో తెలిపారంట‌.

Share post:

Popular