వైరల్ అవుతున్న ‘లక్ష్య’ క్లైమాక్స్ షూట్ వీడియో..!

ఫ్యామిలీ హీరో నాగశౌర్య ప్రస్తుతం ‘వరుడు కావలెను’, ‘పోలీస్ వారి హెచ్చరిక’, ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి పలు చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలోని కొన్ని సినిమాలకు సంబంధించి ఫస్టులుక్స్, టీజర్లు గట్రా రిలీజ్ అయ్యాయి. కరోనా కారణంగా ఈ యంగ్ హీరో అప్‌కమింగ్ సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. అయితే తాజాగా ఆయన స్పోర్ట్స్ డ్రామా అయిన ‘లక్ష్య’ సినిమా షూటింగులో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ నగరంలో క్లైమాక్స్ కి సంబంధించి చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ క్రమంలోనే చిత్రబృందం మేకింగ్ వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. నాగ శౌర్య కెరీర్ లో 20వ చిత్రంగా వస్తున్న ‘లక్ష్య’ కి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. నాగశౌర్యకి జంటగా కేతిక శర్మ నటిస్తుండగా, జగపతిబాబు ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. విలువిద్య నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నారు. నారాయణదాస్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఓ మాదిరి అంచనాలు నెలకొన్నాయి.

Share post:

Latest