శ్రీ విష్ణు మూవీలో కెజిఎఫ్ విలన్ గరుడ..?

ప్రశాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన కేజీఎఫ్ మూవీ ఓ సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. కాగా కేజీఎఫ్ మూవీలో విలన్ పాత్ర అయినటువంటి గరుడ రోల్‌లో నటించి నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు అందుకున్నారు రామ్. కాగా రామ్ ప్ర‌స్తుతం టాలీవుడ్ లో చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోతున్నార‌ని చెప్పాలి. ఇక ఈయ‌న ఇప్పటికే శర్వానంద్ హీరోగా వ‌స్తున్న మహా సముద్రం మూవీలో ఓ కీల‌క రోల్‌లో చేస్తున్నారు.

ఇక ఈ విల‌క్ష‌ణ న‌టుడు రామ్ ది నేడు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయ‌న తన రెండో మూవీని ప్ర‌క‌టించారు. ఆయ‌న తెలుగు హీరో శ్రీ విష్ణు మెయిన్ రోల్‌లో నటిస్తున్న భళా తందనాన మూవీలో చేస్తున్నారు. ఈ మూవీలో ఆనంద్ బాలి అనే చిత్ర‌మైన పాత్రలో రామ్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతున్నర‌నేది రామ్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ ద్వారా మూవీ టీమ్ తెలిపింది. ఈ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసిన కొద్ది సేప‌టికే సోషల్ మీడియాలో చాలా వైరల్ గా త‌యారైంది.

Share post:

Popular