కత్తి మహేష్ కు జగన్ సర్కార్ సహాయం…!

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేశ్ కు ఏపీ ప్రభుత్వం సాయం చేసింది. సీఎంఆర్ఎఫ్ కింద 17 లక్షల రూపాయలను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి విడుదల చేస్తూ… సీఎం స్పెషలాఫీసర్ హరికృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తన చేసే సినీ విమర్శల తోటి ఆయన వార్తల్లో నిలిచేవారు. కత్తి మహేశ్… బిగ్ బాస్ షోకు వెళ్లడంతో ఆయన హైప్ మరింతగా పెరిగింది.

ప్రస్తుతం కత్తి మహేశ్… ఏపీలో ఉన్న వైఎస్సార్సీపీ రాజకీయ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. ఈ కారణంగానే కత్తి మహేశ్… ఆస్పత్రి ఖర్చుల కోసం అక్షరాలా.. 17 లక్షల రూపాయలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసిందని కొంత మంది అంటున్నారు. కత్తి మహేశ్… సినీ క్రిటిక్ గానే కాకుండా… నటుడిగా కూడా పలు సినిమాల్లో రాణించారు.

Share post:

Popular