త‌మ‌న్నా రూట్‌లో కాజ‌ల్‌..త్వ‌ర‌లో అలా క‌నిపించ‌నుంద‌ట‌?!

ఈ మ‌ధ్య కాలంలో కుర్ర హీరోయిన్లు, స్టార్ హీరోయిన్లు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రూ ఓవైపు సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు వెబ్ సిరీస్‌ల‌తో డిజిట‌ల్ రంగంపై హ‌వా చూపిస్తున్నారు. ఇక కొంత మంది హీరోయిన్లు ఓ అడుగు ముందుకేసి.. టీవీ షోల‌కు సైతం హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ నాలుగు రాళ్ల‌ను వెన‌కేసుకుంటున్నారు.

ఈ లిస్ట్‌లో త‌మ‌న్నా ముందు ఉంది. ఈ మిల్కీ బ్యూటీ ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో పాటు ఓ తెలుగు టీవీ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. త‌మ‌న్నా రూట్‌లోనే టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోందట‌.

త‌మ‌న్నా మాదిరిగానే తాను కూడా టీవీ షోల‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని కాజ‌ల్ భావిస్తోంద‌ట‌. పైగా టీవీ షోల‌కు రెమ్యున‌రేష‌న్ కూడా ఎక్కువ‌గా వ‌స్తుండ‌డంతో.. వాటిపై కాజ‌ల్ దృష్టి సారించింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే.. త్వ‌ర‌లోనే కాజ‌ల్ కూడా బుల్లితెర‌పై క‌నిపించ‌నుంది. కాగా, కాజ‌ల్ ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో వ‌రుస చిత్రాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Share post:

Latest