న‌టుడిగా మారిన దర్శకేంద్రుడు..అదిరిన ఫ‌స్ట్ లుక్‌!

ప్ర‌ముక ద‌ర్శ‌కుడు కె.రాఘవేంద్రరావు గురించి తెలియ‌ని వారుండ‌రు. దర్శకేంద్రుడిగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈయ‌న‌.. న‌టుడిగా మారి మొద‌టిసారి వెండితెర‌పై అల‌రించ‌బోతున్నారు. తన దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం పెళ్లి సంద‌D.

శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ చిత్రంలో హీరోగా న‌టిస్తుండ‌గా..శ్రీలీలా హీరోయిన్‌‌‌‌‌‌గా పరిచయం అవుతోంది. అయితే ఈ సినిమాలో రాఘవేంద్ర రావు విశిష్ట అన కీలక పాత్రలో నటిస్తోన్నారు. తాజాగా ఆయన ఫ‌స్ట్ లుక్‌ ప్రోమోను రాజ‌మౌళి విడుదల చేశారు. `వంద సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన తర్వాత మన మౌనముని కెమెరా ముందుకు వచ్చారు` అంటూ జ‌క్క‌న్న కామెంట్ కూడా పెట్టారు.

ఇక తాజాగా విడుద‌ల చేసిన ప్రోమోలో రాఘవేంద్ర రావు సూటు, బూటు వేసుకొని సూప‌ర్ స్టైలిష్‌గా క‌నిపించారు. ప్ర‌స్తుతం ఈ ప్రోమో తెగ ఆక‌ట్టుకుంటోంది. సామాన్యులే కాకుండా.. సినీ ప్ర‌ముకులు కూడా ఈ ప్రోమోపై స్పందిస్తూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Share post:

Latest