గ‌ప్‌చుప్‌గా పెళ్లి చేసుకున్న జబర్దస్త్ వినోద్..ఫొటోలు వైర‌ల్!

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యాడు హాస్య నటుడు వినోద్. చీరక‌ట్టి అచ్చం అమ్మాయి మాదిరి అద్భుతంగా న‌టిస్తూ తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను క‌డుపుబ్బ న‌వ్వించే వినోద్.. గ‌ప్‌చుప్‌గా పెళ్లి చేసుకుని భార్య‌ను అభిమానుల‌కు ప‌రిచ‌యం చేశాడు.

వినోద్ కొత్తగా వినోద్ తో వినోదం పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఈ ఛానల్లో మొదటి వీడియో పోస్ట్ చేసిన వినోద్, తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నాడు. తనకు లాక్ డౌన్ లో పెళ్లికి జరిగిందన్న విషయం బయటపెట్టారు.

నిజానికి జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసే వారిపై అనేక అపోహ‌లు ఉన్నారు. వీరు అమ్మాయిలా, అబ్బాయిలా లేక ట్రాన్స్ జెండర్సా అనే చ‌ర్చ ఎప్పుడూ జ‌రుగుతూ ఉంది. అలాగే వినోద్ జెండర్ పై కూడా అనేక పుకార్ల‌కు వ‌చ్చాయి. అయితే తాజాగా ఈయ‌న పెళ్లి చేసుకుని.. ఆ పుకార్ల‌కు చెక్ పెట్టాడు.

కడప ప్రాంతానికి చెందిన వినోద్ తన అక్క కూతురు అయిన విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి చిన్ననాటి నుండి పరిచయం ఉందని, వినోద్ తెలియజేశారు. ఆ వీడియో ఆమె చేత కూడా మాట్లాడించారు.

వినోద్ కొత్తగా వినోద్ తో వినోదం పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఈ ఛానల్లో మొదట తన పెళ్లి గురించి వీడియో తీసి.. పోస్ట్ చేశాడు. అందులో తనకు లాక్ డౌన్ లో పెళ్లికి జరిగిందనీ.. క‌డ‌ప ప్రాంతానికి చెందిన తన మేనత్త కూతురు విజయలక్ష్మిని వివాహం చేసుకున్నాన‌ని చెప్పుకొచ్చాడు.

 తనకే కాదు జబర్దస్త్‌లో లేడీ గెటప్‌లు వేసే హరికృష్ణకు కూడా పెళ్లి జరిగిందని వినోద్ చెప్పారు. త్వరలో మిగతా వారికి కూడా పెళ్లి జరుగుతుందని అన్నారు. బయట తమపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పుకొచ్చారు. (Image:Youtube/Vinod tho Vinodam)

అంతేకాదు, త‌న భార్య విజ‌య‌ల‌క్ష్మిని కూడా అంద‌రికీ ప‌రిచ‌యం చేశాడు. ఇక ప్ర‌స్తుతం వినోద్ దంప‌తుల ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. మ‌రి వాటిపై మీరూ ఓ లుక్కేసేయండి.

వినోద్ ని పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్న విజయలక్ష్మి, ఇల్లు, హైదరాబాద్ చాల నచ్చాయని చెప్పుకొచ్చింది. ఇక విజయలక్ష్మి కెమెరా ముందు మాట్లాడానికి సిగ్గుపడుతుంది, మాములుగా అయితే మాటలు దులిపేస్తుందని, వినోద్ తెలిపారు.

Share post:

Latest