కన్న కూతురుపై తండ్రి లైగింక దాడి…?

కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన కన్నతండ్రే కూతురుపై కన్నేశాడు. కామంతో కళ్ళు మూసుకుపోయి రాక్షసుడిలా కన్నబిడ్డ పైనే లైంగిక దాడికి తెగబడ్డాడు. ఆరు నెలలుగా కూతురును చిత్రవాద చేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, వెంకటగిరి బంగారుపేటలో చోటు చేసుకుంది. గ్రామంలోని దళితవాడకు చెందిన యువతిపై ఆమె తండ్రి ఆరునెలలుగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవ్వరికీ చెప్పుకోలేక ఆమె తనలో తానే వెక్కివెక్కి ఏడ్చింది. కూతురు ప్రవర్తలో మార్పులు రావడంతో తల్లి కూతురిని గట్టిగా నిలదీసింది. దీంతో ఆమె అసలు విషయం తల్లితో చెప్పింది. కానీ అది విన్న సొంత తల్లి కూడా ఆ దారుణాన్ని పట్టించుకోలేదు. చివరికి ఈ విషయం తెలుసుకున్న బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి పై ఫోక్సో యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ నీచపు తండ్రి పరారిలో ఉండగా.. పోలీసులు అతనికి కోసం గాలిస్తున్నారు.

Share post:

Popular