‘105 మినిట్స్’ నో బ్రేక్ అంటున్న హన్సిక

16 ఏళ్లకే సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన అందాల హన్సిక వరుస సినిమాలతో దశాబ్దం కాలం పాటు హీరోయిన్ గా రాణించింది. ‘దేశముదురు’ చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బాబ్లీ బ్యూటీ క్రమంగా తెలుగు చిత్రాల కంటే తమిళ సినిమాల పైనే ఫోకస్ పెట్టింది. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దిగ్విజయంగా 50 సినిమాల‌ను పూర్తి చేసుకున్న ఈ బ్యూటీకి చేతిలో మ‌రో రెండు ప్రాజెక్టులున్నాయి. ఇవి కాకుండా 53వ చిత్రంగా తెలుగులో ‘105 మినిట్స్’ అనే సినిమాలో న‌టిస్తోంది.

ఈ సినిమాకు రాజా దుస్సా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా మొత్తం హన్సిక చూట్టే తిరుగుతోందట. ఓకే ఇంట్లో..ఓకే ఆర్టిస్ట్ తో.. ఓకే టేక్ లో ఈ సినిమా తీయనున్నట్టు సమాచారం. అసలు ఎడిటింగ్ కూడా లేకుండా చిత్రీకకరిస్తున్న ఈ సినిమా వ్య‌వ‌ధి కూడా 105 నిమిషాలే కావ‌డం విశేషం. మ‌రి సింగిల్ క్యారెక్ట‌ర్‌, సింగిల్ టేక్ మూవీలో హ‌న్సిక ఎలా మెప్పిస్తుందో చూద్దాం.