ఈటల వ్యవహారంపై కమలం నేతల గుస్సా.. !

హుజూరాబాద్ లో మాజీ మంత్రి, ఇటీవల బీజేపీలో చేరిన టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ పై పార్టీ నాయకులు అసంతప్తితో ఉన్నారని తెలిసింది. ఎందుకంటే ఆయన ప్రచారం.. ప్రచారంలో ప్రసంగాలు అన్నీ  సొంత ఎజెండా గురించే మాట్లాడుతుండటం బీజేపీ పెద్దలకు రుచించడం లేదు. కేసీఆర్ ను టార్గెట్ చేయడం కరెక్టేగానీ.. బీజేపీని, ప్రధాని మోదీని పొగడటం కానీ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల గురించి చెప్పడం గానీ చేయడం లేదనేది బీజేపీ నాయకుల అసంతప్తికి కారణం. అసలు హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి, ఈటలకు పోటీ అన్నట్లుంది కానీ.. టీఆర్ఎస్, బీజేపీలకు కాదని ఆ పార్టీ నాయకులే బాహాటంగా చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈటల చేస్తున్న ప్రజాదీవెన యాత్రలో పాల్గొంటున్నా ఎక్కడో ఓ మూస అసంతప్తి అనేది కనిపిస్తోంది.

ఇదిలా ఉండగా బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బదులు ఆయన భార్య బరిలోకి దిగుతుందని సమాచారం. ఎందుకంటే అధికార పార్టీలోంచి వచ్చిన తరువాత నేను ఇంత పెద్దోణ్ని అని చెప్పుకొని.. ఆ తరువాత పొరపాటున ఎన్నికల్లో ఓడిపోతే ఇక ఇజ్జత్ పోతుంది.. అందుకే పథకం ప్రకారం బరిలో భార్య జమునను ఈటల జమున పోటీచేస్తారని తెలిసింది. ఇటీవల ఆమె ’ పోటీలో నేనున్నా.. మా ఆయన ఉన్నా ఒకటే‘ అని అన్న మాటలు నిజమేనేమో అనేలా ఉన్నాయి.