స్టార్ హీరో డైరెక్ష‌న్‌లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ..!?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్, సిరుతై శివ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం అన్నాత్తే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం న‌వంబ‌రు 4న విడుద‌ల కానుంది. అయితే అన్నాత్తే త‌ర్వాత ర‌జ‌నీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌ ఏ డైరెక్ట‌ర్‌తో ఉంటుందా అని అంద‌రూ ఆస‌క్తి ఎదురు చూస్తున్న త‌రుణంతో.. కూతురు సౌంద‌ర్య డైరెక్ష‌న్‌లో సినిమా ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

కానీ, లేటెస్ట్ టాక్ ప్ర‌కారం.. ర‌జ‌నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూతురుతో కాద‌ట‌. కన్నం కన్నుమ్ కొల్లయ్యడితాల్ (తెలుగులో కనులు కనులను దోచాయంటే) దర్శకుడు దేశింగ్ పెరియసామి దర్శకత్వంలో ర‌జ‌నీ త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌నున్నార‌ట‌. ర‌జ‌నీ కెరీర్‌లో 169వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఎజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రూపుదిద్దుకోనుంద‌ట‌.

ఇక ర‌జ‌నీ త‌న 170వ చిత్రాన్ని అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడ‌ట‌. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌కు రజినీ ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య మరియు సౌందర్యలు వ‌ర్క్ చేయ‌నున్నార‌ట‌. మ‌రియు ఇదే ర‌జ‌నీ చివ‌రి చిత్రమ‌ని టాక్ న‌డుస్తోంది.

Share post:

Latest