ఏపీలో కొత్త‌గా 2,567 కరోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?


కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. మ‌రెంద‌రో వైర‌స్‌తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజులుగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే.

అయితే నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెర‌గ‌గా.. మ‌ర‌ణాలు మాత్రం త‌గ్గు ముఖం ప‌ట్టాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,567 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 356 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 19,26,988 కి చేరింది. అలాగే గత 24 గంటల్లో 18 మంది మృత్యువాత ప‌డ్డారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 13,042 ద‌గ్గ‌ర నిలిచింది. అలాగే నిన్నొక్క రోజే 3,034 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 18,87,236 కి చేరుకుంది. ప్ర‌స్తుతం ఏపీలో 26,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక నిన్న ఒక్క రోజే 81,763 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించారు అధికారులు.