కాంట్రాక్ట్ లెక్చరర్ లకు గుడ్ న్యూస్…!

కరోనా మహమ్మారి కారణంగా ప్రైవేట్ టీచర్లు, కాంట్రాక్టు లెక్చరర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. స్కూళ్లు, కాలేజీలు లేక.. జీతాలు రాక.. వేరే పనులు చేసుకోలేక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన ఆంధ్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు లెక్చరర్ లకు తీపి కబురు చెప్పింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు మేలు చేసేలా ఓ నిర్ణయాన్ని ప్రకటించింది.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను మరో ఏడాది పాటు పొడించింది. ఇందుకు సంబందించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జారీ చేసింది. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ వారి సేవలను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీల్లో పని చేస్తున్న 719 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను మరో ఏడాది పాటు వినియోగించుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తమకు ఎంతో మేలు చేసిందని కాంట్రాక్టు లెక్చరర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.