క్రేజీ కాంబో.. కేజీఎఫ్ హీరోతో బోయ‌పాటి మూవీ?

డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మాస్, భారీ యాక్షన్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించి.. టాలీవుడ్‌లో అగ్ర ద‌ర్శ‌కుడిగా ఎదిగిన ఈయ‌న‌ ప్ర‌స్తుతం బాల‌య్యతో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి.

- Advertisement -

అయితే ఈ చిత్రం త‌ర్వాత బోయ‌పాటి ఏ హీరోతో చేస్తాడు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మార‌గా.. ఇప్ప‌టికే అల్లు అర్జున్‌, సూర్య‌, క‌ళ్యాణ్ రామ్ ఇలా ప‌లువురి పేర్లు వినిపించాయి. ఇక ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో, కేజీఎఫ్ మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న య‌ష్ పేరు తెర‌పైకి వ‌చ్చింది.

లేటెస్ట్ టాక్ ప్ర‌కారం.. బోయ‌పాటి లాక్‌డౌన్‌లో ఓ క‌మ‌ర్షియ‌ల్ మాస్ యాక్ష‌న్ క‌థను రెడీ చేశాడ‌ట‌. అయితే ఈ క‌థ‌కు య‌ష్ బాగా సెట్ అవుతాడ‌ని బోయ‌పాటి భావిస్తున్నాడ‌ట‌. ఈ నేప‌థ్యంలోనే య‌ష్‌ను క‌లిసి క‌థ నెరేట్ చేయాల‌ని బోయ‌పాటి ఫిక్స్ అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఇదే నిజ‌మై, య‌ష్‌కు క‌థ న‌చ్చితే.. మ‌రో క్రేజీ కాంబోను తెర‌పై చూడొచ్చు.

Share post:

Popular