హీరోగా బండ్లన్న..డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి కమెడియన్ గా పరిచయమైన బండ్లగణేష్ బ్లాక్‌ బస్టర్‌ సినిమాలతో నిర్మాతగా విజయం సొంతం చేసుకున్నాడు. అయితే ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబుతో కలిసి ట్రైన్ జర్నీలో కనిపించిన బండ్ల గణేష్ అభిమానులను నవ్వులతో ఆకట్టుకున్నాడు. అనంతరం ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ ఇకపై అలాంటి పాత్రలలో నటించను అని తెలియ చేశాడు.

ఇలా ఉండగా తాజాగా తమిళ రీమేక్ సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చిందని వార్తలు వినిపించాయి.. తమిళంలో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న మండెల రీమేక్లో హీరోగా బండ్ల గణేష్ నటించాలని దర్శకుడు కోరగా అందుకు ఆయన ఒకే తెలిపినట్లు తెలుస్తుంది.. వెంకట్ అనే నూతన దర్శకుడు చెప్పిన కథ బండ్ల గణేష్ కు బాగా నచ్చడంతో ప్రధాన పాత్ర పోషించేందుకు ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక ఈ సినిమాను పూర్తిగా వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు, అంతేకాకుండా ఈ సినిమాను స్వయంగా బండ్ల గణేష్ యే నిర్మించబోతున్నట్లు సమాచారం. చూడాలి మరి బండ్ల గణేష్ హీరోగా ఎలా రాణిస్తారో.

Share post:

Latest