అల్లు శిరీష్ మెడ‌కు గాయం..ఏం జ‌రిగిందంటే?

అల్లు అర‌వింద్ త‌న‌యుడిగా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అల్లు శిరీష్‌.. ప్ర‌స్తుతం ప్రేమ కాదంట అనే ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో అను ఇమ్మన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రాకేశ్‌ శశి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం కోసం శిరీష్ బాడీ పెంచే పనిలో పడ్డారు.

గత కొన్ని రోజులుగా జిమ్‌లో శిరీష్ తెగ కష్టపడిపోతోన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా శిరీష్ మెడ‌కు తీవ్ర గాయం అయింది. వర్కవుట్‌ సమయంలో శిరీష్ గాయ‌ప‌డ్డాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా శిరీష్ సోష‌ల్ మీడియా ద్వారా తెలిపాడు.

తన మెడకు బ్యాండ్‌ వేసిన ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్ చేస్తూ..ఇది ఫ్యాషన్‌ కోసం పెట్టుకుంది కాదు, స్ట్రెంత్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నప్పుడు నిజంగానే మెడకు దెబ్బ తగిలింది అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో అభిమానులు మ‌రియు నెటిజ‌న్లు శిరీష్ త్వ‌ర‌గా కోలుకోవాలీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Allu Sirish hurts his neck during strength training; Shares PIC on social  media | PINKVILLA

Share post:

Latest