ఆకాష్ పూరీ `చోర్‌ బజార్‌`.. ఇంట్ర‌స్టింగ్‌గా ఫ‌స్ట్ లుక్!

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు, యంగ్ హీరో ఆకాష్ పూరీ తాజా చిత్రం `చోర్ బ‌జార్‌`. జార్జ్ రెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గెహన సిప్పీ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే నేడు ఆకాష్ పూరీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చోర్ బ‌జార్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో ఆకాష్ ఓ చేతిలో తుపాకీ, మరో చేతిపై బచ్చన్ సాబ్ అనే టాటుతో ఫుల్‌ ఆంగ్రీ లుక్‌లో క‌నిపిస్తున్నాడు.

ఇక మొత్తానికి సూప‌ర్ ఇంట్ర‌స్టింగ్‌గా ఉన్న ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌.. సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. అలాగే మాస్‌ ఎలిమెంట్లతో ఈ చిత్రం రూపొందుతుందని తాజా పోస్టర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది.

Image

Share post:

Latest